ఓ నా ఇష్టసఖీ!
ఓ నాయిష్టసఖీ
నను కష్టపెట్టకే
పువ్వులిస్తానే
నవ్వులుచిందవే
సరసాలాడతానే
సంతోషించవే
తోడుకురావే
వేడుకచెయ్యవే
చెంతకొస్తానే
చెలిమిచెయ్యవే
కబుర్లుచెబుతానే
కుషీగానుండవే
మాటలుచెబుతానే
ముచ్చటపడవే
మూతినిముడుచుకోకే
నోటినిమూసుకొనకే
అలగకే
పడకెక్కకే
కోపముతెచ్చుకొనకే
కోరికతిరస్కరించకే
కన్నీరుపెట్టకే
క్షోభకుగురిచేయకే
కొరకొరాచూడకే
కోర్కెలచిట్టావిప్పకే
పొమ్మనిచెప్పకే
పరువునుతీయకే
బ్రతిమాలించుకోకే
భంగపాటుచెయ్యకే
కరుణించవే
కోరికమన్నించవే
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment