ఓరి మనిషీ!


ఓరి మానవుదా!

నీకు

ఏమి స్వార్ధమురా?

ఎన్ని కోరికలురా?

ఎంత ఆరాటమురా?


రేపు

తెల్లవారివెలుగును చూస్తావోలెదోతెలియదు

బ్రతికియుంటావోలేదో ఏమాత్రము తెలియదు

కానీ

జేబులు నిండా డబ్బులుండాలా

తరాలకు తరగని ఆస్తులుండాలా


చస్తే

స్వర్గానికే పోవాలా

సుఖాలునే అనుభవించాలా

కానీ

నరకానికి పోకూడదా

చిత్రహింసలకు గురికాకూడదా


రేపు

ఏమిచేస్తావో తెలియదు

ఎక్కడుంటావో తెలియదు

ఏమితింటావో తెలియదు

కానీ

తలలో తెలివియుండాలా

దేహంలో శక్తియుండాలా

కాసులు సంపాదించాలా


బలమున్నా

నీకే ఉపయోగించుకోవాలా

నీవారికే వాడుకోవాలా

ధైర్యంగా బ్రతకాలా

కానీ

మంచిపనులు చెయ్యవా

పరులకు సహాయపడవా

సమాజాన్ని ఉద్ధరించవా


రేపు

ఏమివ్రాస్తావో ఏమో తెలియదు

నేడు విషయాల వాసనేలేదు

కవప్రక్రియ కొనసాగించాలంటావు

కానీ

రాత్రి నిద్రపోతావు

ఆలోచనలు ఆపేస్తావు

మనసుకు విశ్రాంతినిస్తావు


అయినా

కవితలు అద్భుతంగావ్రాయాలంటావు

అందరిని ఆకర్షించాలంటావు

పాఠకుల మనసులతట్టాలంటావు

అందాలను చూపించాలంటావు

ఆనందాలను కలిగించాలంటావు

మదులలో నిలిచిపోవాలంటావు

సాహిత్యలోకంలో శాశతస్థానంకావాలంటావు


ఓరి మానవుడా!

నీవు

సరిగా ఆలోచించరా

సక్రమంగా నడచుకోరా

కోర్కెలు తగ్గించుకోరా

స్వార్ధం విడిచిపెట్టరా

సమాజాన్ని బాగుపరచరా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog