మానవులా! మృగాలా!!
మానవులా
కౄరమృగాలా!
మనుజులా
ఆటవికులా!
ఆడపిల్లలా
ఆడుకొనేబొమ్మలా!
అక్కాచెల్లెళ్ళా
ఆటవస్తువులా!
కోరికలా
ఊరేజలాలా!
మనసా
వరదప్రవాహమా!
మాటలను
ఈటెల్లా విసురుతా!
కలాలను
కత్తుల్లాపడతా!
దౌర్జన్యకారులకు
దేహశుద్ధిచేస్తా!
దగాకోరులకు
బడితపూజచేస్తా!
అహింసాపరులను
అంతంచేస్తా!
ద్వేషపరులను
దగ్ధంచేస్తా!
అన్యాయంచేసేవార్ల
ఆటలుకట్టిస్తా!
అక్రమాలుచేసేవారిని
ఎదిరిస్తా!
అత్యాచారాలకొడిగట్టేవాళ్ళను
అగ్నికి ఆహుతిచేస్తా!
మోసగాళ్ళ
భరతంపడతా!
చీడపురుగులను
చిదిమేస్తా!
బాధలుపెట్టేవారిని
భస్మంచేస్తా!
మంచిని
తలకెత్తుకుంటా!
నీతిపరులను
మెచ్చుకుంటా!
వదాన్యులను
పొగుడుతా!
కరుణామయులను
కీర్తిస్తా!
సమాజానికి
సహాయపడతా!
సంఘాన్ని
సంస్కరిస్తా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment