మాతృభాష ముచ్చట్లు
అమ్మభాష అమృతము
మాతృభాష మరందము
మనభాష వరాలతెలుగు
మనతెలుగు సూర్యునివెలుగు
తెలుగుభాష బహుతియ్యన
తేటతెలుగు కడుకమ్మన
మనతెలుగు దేశానలెస్స
మనభాష లోకానమిన్న
తెలుగుతోట సుందరంబు
తెలుగుపూలు సౌరభంబు
తెలుగుతల్లిని ఆరాధిద్దాం
తోటియాంధ్రుల గౌరవిద్దాం
తెలుగువాడినని గర్విద్దాం
తెలుగోళ్ళను సంతసపరుద్దాం
తెలుగుజ్యోతిని వెలిగిద్దాం
తెలుగుభాషను వ్యాపిద్దాం
ఆంధ్రాక్షరాలు ముత్యాలు
తెలుగుపదాలు తేనెచుక్కలు
తెలుగులోనే పలుకుదాం
తెలుగుసుధలు చిమ్ముదాం
ఆంధ్రులచరిత్ర తెలుపుదాం
ఆంధ్రులపౌరుషం చాటుదాం
అచ్చతెలుగును వాడుదాం
తేటతెలుగును నేర్పుదాం
మాతృభాషను మరువద్దు
కన్నతల్లిని కసరుకోవద్దు
తల్లిబాష తిరస్కరణము
తనసొంతతల్లి తిరస్కారము
తెలుగుఝరి గోదారమ్మ ఉరుకులు
తెలుగుస్రవంతి క్రిష్ణమ్మ పరుగులు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
🌷🌷🌷🌷🌷🌷🌷అందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు🌷🌷🌷🌷🌷🌷🌷

Comments
Post a Comment