కుళ్ళిన మనుషులు


బ్రతికుండగానే

మనుషులు కుళ్ళిపోతున్నారు

పరిసరాలలో

దుర్గంధం వెదజల్లుతున్నారు


ఇల్లు ఖాళీచేయమంటే

కిరాయిదారుడు కుదరదంటున్నాడు 

మరోయిల్లు చూచుకోమంటే

మదమెక్కి మొండిచేస్తున్నాడు


చెప్పినట్టు వినకపోతే

నిందలు మోపుతున్నాడు

అందరిముందు పంచాయితీపెట్టి

అభాసుపాలు చేస్తున్నాడు


సర్దుకుపోదామంటే

ససేమిరా అంటున్నాడు

తనుచెప్పినట్లే

వినవలిసిందే అంటున్నాడు


పిలిస్తే

పలుకకున్నాడు

విషాన్ని

కక్కుతున్నాడు


పెద్దలు చెబితే

సమయం కావాలంటున్నాడు

డబ్బులు ఇస్తేనే

ఇల్లు ఖాళీచేస్తానంటున్నాడు


ప్రశ్నిస్తే

పరేషానీ చేస్తున్నాడు

చివాట్లుపెడితే

చికాకు కలిగిస్తున్నాడు


కొమ్మ చెడిపోతే

కొట్టెయవచ్చు

చెట్టు చెడిపోతే

పూర్తిగా నరికెయ్యాల్సిందేగదా!


వ్యక్తులు చెడితే

దారికి తెచ్చుకోవచ్చు

సమాజమే చేడితే

ఉధ్ధరించేదెట్లా!


సమాజమా!

ఆలోచించు

పరిస్థితిని

సరిదిద్దు


ఆలశ్యమయితే

అమృతంకాస్తా

విషముగా మారవచ్చు

దారుణాలు జరుగవచ్చు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog