ఏంటిరా మామా!
కన్నుగీటినా
కదలికలేకున్నది
చిరునవ్వులుచిందినా
స్పందనలేకున్నది
సిగ్గువిడిచినా
చలనంలేకున్నది
పలుకరించినా
సమాధానంరాకున్నది
షోకులుచూపినా
లాభంలేకున్నది
వలపువలవిసిరినా
వ్యర్ధమగుచున్నది
మల్లెపూలుముడుచుకున్నా
ఫలంలేకున్నది
పరిమళాలుచల్లినా
ప్రయోజనంలేకున్నది
గులాబీ అందించినా
గుండెకుగుచ్చుకోకున్నది
ప్రేమఝల్లులుకురిపించినా
ప్రతిస్పందనలేకున్నది
చెంతకుపిలిచినా
చెవికెక్కించుకోకున్నాడు
చేయిచాచినా
అందుకోకున్నాడు
చెలిమికోరినా
ససేమిరాయంటున్నాడు
ఇకలాభంలేదని
తెలుసుకున్నా
తూర్పుతిరిగి
దండంపెట్టుకుంటున్నా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment