పడుచొకతె
పడుచొకతె
ప్రత్యక్షమయ్యింది
గుండెలోన
గుబులుపుట్టించిపోయింది
నిద్రించగానె
కలలోకివచ్చింది
ఊరకుండక
కవ్వించిపోయింది
అతివలోనె
వెచ్చదనమున్నది
వెన్నవలె
మనసుకరిగించుచున్నది
ప్రేమలోనె
పాశమున్నది
పరువములోనె
పొంగుయున్నది
అందములోనె
ఆనందమున్నది
కళ్ళలోనె
కామమున్నది
జోడుంటేనె
జల్సాయున్నది
కలసుంటేనె
కుషీయున్నది
నచ్చగానె
మెచ్చాలనిపించింది
చూపుతిప్పక
చూడాలనిపించింది
నవ్వగానె
బదులివ్వాలనిపించింది
పలకగానె
సరసాలాడాలనిపించింది
కోరితె
పెళ్ళాడాలనియున్నది
కాపురంపెట్టి
పిల్లలకనాలనియున్నది
తాడోపేడో
తేల్చుకుంటా
తోడుకుతక్షణమే
తెచ్చుకుంటా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment