అక్షరాలఝరి


పూలవాన 

కురిపిస్తా

మనసులను

మురిపిస్తా


ప్రేమవర్షము

పారిస్తా

ఆనందంలో

ముంచేస్తా


అధరామృతాన్ని

అందిస్తా

అమితానందాన్ని

చేకూరుస్తా


నవ్వులజల్లులు

గుప్పిస్తా

మోములను

వెలిగిస్తా


ముత్యాలముసురు

సాగిస్తా

చిత్తాలను

సంతసపరుస్తా


కనకధారను

పారిస్తా

కవనప్రక్రియను

కొనసాగిస్తా


అక్షరాలఝరిని

ప్రవహింపజేస్తా

అంతరంగాలను

అలరింపజేస్తా


తేనెపలుకులు

చిందిస్తా

తీపిరుచులు

చూపిస్తా


కలముసిరాను

కార్పిస్తా

కమ్మనికైతలను

కుమ్మరిస్తా


కవితాసుధలను

స్రవిస్తా

సాహితీమాధుర్యాలను

చవిచూపిస్తా


కవితామృతాన్ని

సేవించండి

కవివ్రాతలను

గుర్తుంచుకోండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog