కవివర్యా!
చూపవోయ్ అందాలు
చేర్చవోయ్ ఆనందాలు
అల్లవోయ్ అక్షరాలు
పొసగవోయ్ పదాలు
చెయ్యవోయ్ అక్షరసేద్యము
తియ్యవోయ్ ఫలసాయము
కనవోయ్ పగటికలలు
కూర్చవోయ్ కల్పనలు
పనిపెట్టవోయ్ మనసులకు
పారించవోయ్ ఆలోచనలు
బయటపెట్టవోయ్ భావాలు
కలిపించవోయ్ భ్రమలను
పాడవోయ్ ప్రబోధగీతాలు
పులకించవోయ్ శ్రోతలను
పఠించవోయ్ ప్రణయగీతాలు
పారించవోయ్ నవరసంబులు
చిందించవోయ్ తేనెచుక్కలను
చవిచూపవోయ్ తియ్యదనాలు
వదిలించవోయ్ నిద్రమత్తును
మేలుకొలపవోయ్ పాఠకులను
వ్రాయవోయ్ సుకవితలను
మురిపించవోయ్ మదులు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment