కవిత్వం
అక్షరాలు విత్తనాలయితే
కవిత్వం ఒక పంట
అక్షరాలు విరులయితే
కవిత్వం ఒక పూలతోట
అక్షరాలు ముత్యాలయితే
కవిత్వం ఒక హారం
అక్షరాలు కిరణాలయితే
కవిత్వం ఒక ప్రకాశం
అక్షరాలు తేనెచుక్కలైతే
కవిత్వం జిహ్వకుపసందు
అక్షరాలు రాగాలయితే
కవిత్వం వీనులకువిందు
అక్షరాలు ఇటుకలైతే
కవిత్వం ఒక గృహం
అక్షరాలు ఆకులైతే
కవిత్వం ఒక వృక్షం
అక్షరాలు తారకలైతే
కవిత్వం నీలిమబ్బు
అక్షరాలు మేఘాలైతే
కవిత్వం ముత్యాలజల్లు
అక్షరాలు ఆలోచనలైతే
కవిత్వం ఒక భావం
అక్షరాలు ప్రవాహమైతే
కవిత్వం ఒక నదం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అందరికీ అంతర్జాతీయ కవితా దినోత్సవ శుభాకాంక్షలు
Comments
Post a Comment