కవనసుధలు


భక్తిలో మునిగితే

భజనలు చేయవలసిందే

భగవంతునికటాక్షం పొందవలసిందే


ముక్తి కోరుకుంటే

మానవసేవ చేయవలసిందే

మాధవుని మురిపించవలసిందే


రక్తిలో పడితే

రంజిల్లవలసిందే

రసికరాజ్యంలో విహరించవలసిందే


భుక్తి కావాలనుకుంటే

బాధలు పడవలసిందే

బొజ్జను భారీగాభర్తీచేయవలసిందే


సూక్తి చెప్పాలనుకుంటే

సొంపుగాయింపుగా కూర్చాల్సిందే

సకలురు పాటించేలావుండవలసిందే


మనిషిగా మెలగాలంటే

మంచిపనులు చేయవలసిందే

మహిలో మానవత్వంచాటవలసిందే


తెలుగు పలికితే

తేనెచుక్కలు చిందవలసిందే

తీపిరుచిని శ్రోతలకుచేర్చవలసిందే


గళం యెత్తితే

గానామృతం పారవలసిందే

గగనపుయంచులుదాకా తీసుకొనివెళ్ళాల్సిందే


అందాలు కనబడితే

ఆస్వాదన చేయవలసిందే

అనుభూతులందరితో పంచుకోవలసిందే


కలము చేబడితే

కమ్మగా కూర్చవలసిందే

కవనప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోవలసిందే


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog