శ్రీరామదూతా! శ్రీహనుమంతా!
ఆంజనేయస్వామి
అతిపరాక్రమవంతుడు
అంజనీపుత్రుడతడు
ఆరాధ్యనీయుడతడు
సీతమ్మజాడను
కనిపెట్టినవాడు
లంకాదహనమును
కావించినవాడు
శ్రీరామభక్తుడు
సాటిలేనిసేవకుడు
సంజీవనినితెచ్చాడు
సౌమిత్రినికాపాడాడు
చావులేనియట్టి
చిరంజీవియతడు
బాదరబందీలేని
బ్రహ్మచారియతడు
హనుమంతస్వామి
అందరికీయిష్టుడు
ఆరాధించేవారిని
ఆదరించేవాడతడు
ఒంటరిగున్నవాళ్ళను
వెంటుండినడిపించేవాడు
భూతపిశాచబాధలను
తొలగించేవాడతడు
ఆకుపూజలకు
ఆనందించేవాడు
ఆపన్నులను
ఆదుకొనేవాడు
మారుతినామమున
మసలువాడతడు
మాయమర్మములేని
మహనీయుడతడు
భయభ్రాంతులను
పారద్రోలువాడతడు
భక్తులపాలిటకొంగు
బంగారమతడు
పిలిచినపలుకు
పవనపుత్రుడతడు
ప్రార్ధించువారలను
పరిరక్షించువాడతడు
మారుతీస్వామికి
మరలమరలా మ్రొక్కెదా
పవనపుత్రునిని
పదేపదే ప్రార్ధించెదా
ఆరోగ్యమునీవ్వమని
అడిగెదనాంజనేయుని
ఐశ్వర్యమివ్వమని
ఆశ్రయించెద హనుమానుని
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
Comments
Post a Comment