అపరూపసౌందర్యం
అదిగో అల్లదిగో
అందాలరూపం
అద్భుతదృశ్యం
ఆనందవర్ధనం
ఎంత సొగసో
కళ్ళనుకట్టేసి
మదినిదోచేసి
మురిపిస్తున్నది
ఎంత సంతసమో
నవ్వులుచిందించి
మోమునువెలిగించి
కాంతులుచిమ్ముచున్నది
ఎంత వినయమో
సిగ్గుతోతలవంచుకొని
క్రీగంటతదేకంగాచూస్తూ
వయ్యారలొలుకుచున్నది
ఎంత ప్రేమో
అందాలువడ్డిస్తూ
ఆనందంకలిగిస్తూ
విందుకాహ్వానిస్తున్నది
ఎంత పరిమళమో
నల్లనికురులలో
తెల్లనిమల్లెలుదాల్చి
మత్తెక్కించిమోహంలోదించుతున్నది
ఎంత సామీప్యమో
సాయంసమయంలో
చిరుగాలివీస్తూ
ముంగురులనాడిస్తున్నది
ఎంత ప్రోత్సాహమో
ఉత్సాహమునునింపుతూ
ఊహలుహృదిలోపారిస్తూ
ఉషోదయాన కవితనువ్రాయించింది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment