కవితోద్భవం
సుర్యోదయమయితే
సుకవిత సముద్భవించవలసిందే
ఆలోచనలుపారితే
అద్భుతకవిత ఆవిష్కరించవలసిందే
భావంబలీయమయితే
బ్రహ్మాండమైనకవిత బయటపడవలసిందే
అందంసాక్షత్కారమయితే
అద్బుతమైనకవిత అల్లవలసిందే
ఆనందంకలిగితే
అపరూపకవిత అవతరించవలసిందే
మనసుముచ్చటపడితే
మనోరంజకమైనకవిత ముందుకురావలసిందే
కలంకదిలితే
కళాత్మకమైనకవిత కళ్ళముందుపెట్టవలసిందే
సుమాలువిచ్చుకుంటే
సుగంధభరితకవిత సృష్టించవలసిందే
పాఠకులుకోరితే
పసందైనకవిత ప్రభవించవలసిందే
పోటీలకుకవితలుపిలిస్తే
ప్రధమబహుమతిపొందేకవిత పంపవలసిందే
కందరాలుక్రమ్ముకుంటే
కమ్మనికవితాజల్లులు కురవవలసిందే
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment