కవితా వైభవం
కవిత
పుట్టిందంటే
కాంతి
ప్రభవించాలి
కవిత
పూసిందంటే
సౌరభము
వ్యాపించాలి
కవిత
కాసిందంటే
నోర్లను
ఊరించాలి
కవిత
చదివామంటే
కమ్మదనము
కలిగించాలి
కవిత
కనపడినదంటే
గబగబా
చదివించాలి
కవిత
ఆస్వాదిస్తే
కడుపులు
నిండిపోవాలి
కవిత
దొర్లిందంటే
కాగితం
కళకళలాడాలి
కవిత
కూర్చామంటే
ముత్యాలసరమై
తెలుగుతల్లిమెడనలంకరించాలి
కవిత
విన్నామంటే
చెవులను
నిక్కపొడిపించాలి
కవిత
పాడామంటే
శ్రోతలను
ఉర్రూతలూగించాలి
కవిత
పుటలకెక్కిందంటే
కవిని
చిరంజీవినిచేయాలి
కవితా
శీర్షిక
కళ్ళను
కట్టిపడవేయాలి
కవితా
అక్షరాలు
కడుపసందు
కలిగించాలి
కవితా
పదములు
తేనెచుక్కలను
చిమ్మాలి
కవితా
విషయము
మదులలో
తిష్టవెయ్యాలి
కవితలకు
స్వాగతం
కవులకు
నీరాజనం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మంచికవితకుముహూర్తమెపుడు
మదనపడినపుదు
మనసుగాయపడినపుడు
మాటలువెంటపడినపుడు
కవిత్వమునకు
రంగులుండవు
హంగులుండవు
పొంగులుండవు
కవిత్వము
స్వచ్ఛము
అద్బుతము
కాంతిమయము
ఒక్కో కవిది
ఒక్కో శైలి
ఒక్కో కవితది
ఒక్కో రీతి
కవితలను
స్వాగతించు
కవులను
ప్రోత్సహించు
Comments
Post a Comment