నా ఆలోచనలు
(శుభసంగతులు సంతోషసూచనలు)
పువ్వులు
చల్లనా
పరిమళాలు
వీచనా
తీపివార్తలు
చెప్పనా
తనువులను
తృప్తిపరచనా
చల్లగాలి
తోలనా
సేదను
తీర్చనా
సోయగాలు
చూపనా
సంతసాలు
కూర్చనా
వేడుకలు
చెయ్యనా
విందులు
ఇవ్వనా
శాలువా
కప్పనా
సన్మానము
చెయ్యనా
పూలగుచ్ఛము
అందించనా
ప్రేమాభిమానము
ఎరిగించనా
కోకిలతో
పాడించనా
నెమలితో
ఆడించనా
చిలుకపలుకులు
పలికించనా
తేనెపలుకులు
చిందించనా
వేసవితాపానికి
తాటిముంజలివ్వనా
మధురమామిడిపండ్లు
నోటిముందుపెట్టనా
దడదడ ఉరుములు
ఉరిమించనా
తళతళ మెరుపులు
మెరిపించనా
టపటప వానజల్లులు
కురిపించనా
బిరబిర వాగులువంకలు
పారించనా
ప్రేమతో
గుండెనునింపనా
స్నేహంలో
హృదినిముంచనా
కలమును
పట్టనా
కాగితాలు
నింపనా
కమ్మనికైత
కూర్చనా
ప్రియపాఠకుల
పరవశింపజేయనా
కవితలు
చదివించనా
పాటలు
పాడించనా
ఇష్టమైనవిషయాలు
వివరించనా
కష్టమైనవస్తువులు
దాటవేయనా
కవితలకు
కాచుకో
పఠించుటకు
పూనుకో
అక్షరాల అల్లిక
ఆకట్టుకుందా
పదాల ప్రయోగము
ఫలించిందా
చదివితే
సంతోషము
స్పందిస్తే
ధన్యవాదాలు
అన్నీ
మంచిసంగతులే
అందరికీ
సంతోషసూచనలే
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment