ఆలోచనామృతం 


సంగీతం

ఆపాతమధురం

సాహిత్యం

ఆలోచనామృతం


రెక్కలు

విచ్చుకుంటేనే

విహంగాలు

ఎగురగలవు


మబ్బులు

ముసురుకుంటేనే

వానజల్లులు

కురువగలవు


సూర్యుడు

ఉదయించితేనే

తూరుపు

తెల్లవారుతుంది


చంద్రుడు

పొడిస్తేనే

వెన్నెల

వ్యాపిస్తుంది


డబ్బులు

జేబులోయుంటేనే

కడుపులు

నిండుతాయి


పూలు

పూస్తేనే

తోటకు

అందంవస్తుంది


విరులు

విచ్చుకుంటేనే

సౌరభాలు

వెదజల్లుతాయి


పిల్లలు

ఉంటేనే

ఇల్లు

కళకళలాడుతుంది


కాంతలకు

కురులుంటేనే

కొప్పేదైనా

అందాన్నిస్తుంది


ఆలోచన

తడితేనే

భావము

బయటకొస్తుంది


ఆవేదన

కలిగితేనే

అద్భుతరచన

అవతరిస్తుంది


మనసు

ముచ్చటపడితేనే

మంచికవిత

ముందుకొస్తుంది


చక్కనికైత

చదివితేనే

చదువరులకు

సంతోషంకలుగుతుంది


కవితకు

ప్రాసలేకపోతే

కూరలో

ఉప్పులేనట్లుచప్పనే


సరుకున్నకవి

చక్కనికవితను

అనునిత్యము

అందించగలడు


దినదినం

కవితలుచదవండి

ప్రతిదినం

పరవశించిపోండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog