నేను! నాపూబోడి!!


పువ్వు

సోయగం

నీకేది చెలియా?


పువ్వు

సౌరభం

నీకేది ప్రియురాలా?


పువ్వు

సంతసం

నీకేది సఖియా?


పువ్వు

కోమలం

నీకేది ప్రణయినీ?


పువ్వు

రంగు

నీకేది సకియా?


పువ్వు 

నవ్వు

నీకేది ప్రేయసీ?


ఏమిటేమిటీ

పువ్వులనుతెచ్చి

ప్రక్కనపెట్టుకోమంటావా!


అతివా

అలరులనుచూచి

అసూయపడుతున్నావా!


కుసుమాలుతెస్తా

కొప్పులోపెడతా

కలతచెందకుచెలీ!


హమ్మయ్య

అతివ

అలకతీరింది


పూబోడి

పువ్వుతోకూడి

పక్కకొచ్చింది


ఇప్పుడు మామధ్య

అలకలులేవు

అలజడులులేవు


మా అనందానికి

హద్దులులేవు 

పద్దులులేవు


పువ్వుకి 

పూధారికి

పలుధన్యవాదాలు 


పూబాణుడికి

ప్రణయదేవతకు

పెక్కుప్రణామాలు 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog