కవిత్వావిష్కారం


కవితవచ్చి

కవ్విస్తేగాని

కవితావిష్కారం

కాకున్నది


పువ్వులొచ్చి

ప్రాధేయపడితేగాని

పుష్పకవిత

పుట్టకున్నది


వనితవచ్చి

వలపువలవిసిరితేగాని

విరహకవిత

వెలువడకున్నది


కలలోకివచ్చి

కైతకోరితేగాని

కల్పితకవితను

కూర్చలేకుంటి


తెలుగుపదాలుతట్టి

తేనెచుక్కలొలికితేగాని

తేటతెలుగుకవిత

తీసుకురాలేకుంటి


ఆలోచనలుపారి

భావనకలిగితేగాని

బేషూకైనకవితను

బయటపెట్టలేకుంటి


మాటలొచ్చి

మదినిముట్టితేగాని

మంచికవితను

ముందుపెట్టలేకుంటి


అందాలుకనపడి

ఆనందపరిస్తేగాని

అద్భుతకవితను

ఆవిష్కరణచేయలేకుంటి


సాహితివచ్చి 

సన్నుతిచేసినకాని

సరసమైనకవితను

సృష్టించలేకుంటి


జానకివచ్చి

జబ్బతట్టినగాని

జల్సాకవితకు

జన్మనీయలేకుంటి


పార్వతివచ్చి

ప్రొత్సహించినగాని

పసందైనకవితను

పుటలపైకెక్కించలేకుంటి


వాణీవచ్చి

వేడుకున్నగాని

విరులకవితను

వ్రాయలేకుంటి


అనితవచ్చి

అభ్యర్ధించినగాని

అసలుసిసలైనకైతను

అందించలేకుంటి


పద్మావతివచ్చి

పొగడకున్నగాని

ప్రణయకవితను

పేర్చలేకుంటి


పాఠకులుకోరినరీతి

చిత్రకవితలువ్రాస్తి

పుష్పకైతలురాస్తి

ప్రణయకయితలుకూర్చితి


వాగ్దేవివెన్నుతట్టి

విరచించమన్నట్టి

వివిధప్రక్రియలందు

తెలుగుతల్లికవితలనువ్రాస్తి


జై తెలుగుతల్లి

జై జై తెలుగుతల్లి

జై సరస్వతీమాత

జై జై సరస్వతీమాత


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog