కవితావిస్ఫోటనం
ఎవరో
తలలో
బాంబునుపెట్టారు
నిప్పునంటించారు
భారీశబ్దం
వచ్చింది
విస్ఫోటనం
జరిగింది
ఆలోచనలు
ఎగిరిపడ్డాయి
భావనలు
విసరబడ్డాయి
భ్రమ
కలిగింది
భ్రాంతి
ముసురుకుంది
అలజడి
లేపింది
ఆరాటం
చేసింది
వ్రాయకుండా
ఉండలేకున్నా
చదవకుండా
నోరుమూసుకోకున్నా
కలంపట్టకుండా
కూర్చోలేకున్నా
కాగితాలునింపకుండా
కరముకట్టేసుకోలేకున్నా
నిత్యకవితను
నిరోధించలేకున్నా
సాహిత్యసేవను
సమాప్తంచేయలేకున్నా
నిద్ర
రావటంలేదు
ఆకలి
అవటంలేదు
విషయాలు
వీడటంలేదు
తలపులు
తరగటంలేదు
కవితాప్రవాహం
కదిలిపోతుంది
కవనకార్యం
కొనసాగుతుంది
ఎప్పటివరకో
ఈ కార్యక్రమం
ఎందుకొరకో
ఈ ప్రయత్నం
ఎక్కడివరకో
ఈ పయనం
ఎవ్వరికొరకో
ఈ కవనం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment