నా బంగారం
అందాన్ని
చూశా
ఆనందాన్ని
పొందా
వలను
విసిరా
పిట్టను
పట్టా
పూలను
ఇచ్చా
ప్రేమను
తెలిపా
మనసు
విప్పా
ముచ్చట
పరచా
చెంతకు
పిలిచా
చెలిమిని
కోరా
ఆమెను
మెచ్చా
ఆమెకు
నచ్చా
ఒంటరిగా
పిలిచా
తుంటరిగా
మాట్లాడా
నవ్వులు
పంచా
ముగ్గులోకి
దించా
మతి
పోగొట్టా
మత్తులో
పడవేశా
ఈడు
కుదిరింది
జోడు
కొచ్చింది
తోడుగా
నిలిచింది
నీడగా
మారింది
కల
నిజమయ్యింది
కోరిక
నెరవేరింది
సుకన్య
చేరువయ్యింది
స్వర్గం
చూపించింది
సుఖము
ఇచ్చింది
శాంతి
కూర్చింది
బంధం
పడింది
బంధీ
అయ్యింది
స్వప్న్మం
సార్ధకమయ్యింది
సమస్య
పరిష్కారమయ్యింది
కాపురం
కలిసొచ్చింది
కుటుంబం
వృద్ధిచెందింది
బ్రతుకు
బంగారమయ్యింది
జీవితం
సుఖమయమయ్యింది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment