నెచ్చలి ముచ్చట్లు
సఖీ
నీకిష్టమైతే
చెంతకొస్తావు
చేయిచాస్తావు
చెలిమిచేస్తావు
కానీ
నాకిష్టమైతే
పట్టించుకోవు
పలుకరించవు
ప్రతిస్పందించవు
సఖీ
నీకునచ్చితే
నవ్వుతావు
నవ్విస్తావు
నమ్మిస్తావు
కానీ
నాకునచ్చితే
నసుగుతావు
నటిస్తావు
నాలుకవెళ్ళబెడతావు
సఖీ
నీవుమెచ్చితే
ఇంద్రుడవంటావు
చంద్రుడువంటావు
చప్పట్లుకొడతావు
కానీ
నేనుమెచ్చితే
గమ్ముగుంటావు
వమ్ముచేస్తావు
పొమ్మనంటావు
సఖీ
నేనుపిలిస్తే
ఉలకవు
పలకవు
కదలవు
కానీ
నీవుపిలిస్తే
బరాబరారావాలి
బదులివ్వాలి
బద్ధకంవీడాలి
సఖీ
నీవుకోరితే
కాసులివ్వాలి
కొనిపెట్టాలి
కష్టపడాలి
కానీ
నేనుకోరితే
బెట్టుచేస్తావు
బదనాంచేస్తావు
బ్రతిమాలించుకుంటావు
సఖీ
నీవుమెడవంచితే
తాళికట్టాలి
తోడుగుండాలి
తృప్తిపరచాలి
కానీ
నేనుమెడవంచితే
గేళిచేస్తావు
గంతులేస్తావు
గడుసుగుంటావు
సఖీ
నీకు
షోకులుకావాలి
సుఖంకావాలి
సంసారంకావాలి
కానీ
నేను
పాట్లుపడాలి
పోషించాలి
పరిరక్షించాలి
సఖీ
మనంబాగుపడాలంటే
అన్యోన్యంగాయుండాలి
కలసిముందుకుసాగాలి
సంసారసాగరమునీదాలి
కానీ
మనమెప్పుదు
తిట్టుకోకూడదు
కొట్టుకోకూడదు
రట్టుచేసుకోకూడదు
సఖీ
మనకుకుదిరితే
ముందుకెళ్దాం
లేకపోతే
వెనుకడుగేద్దాం
సఖీ
ఆలోచించు
నిర్ణయంచెప్పు
ఔనంటే బంగారుభవితకు
పూలబాట వేసుకుందాము
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment