బిడ్డల్లారా!
పలుకునై
పెదవులను
కదిలిస్తా
కులుకునై
కూనలను
నవ్విస్తా
పువ్వునై
పరిమళాలు
వెదజల్లుతా
నవ్వునై
మోములను
వెలిగిస్తా
తేనెనై
నాలుకలను
తడిపేస్తా
వేడినై
గుండెలను
కరిగిస్తా
అక్షరాలనై
ఆలోచనలు
వెల్లడిస్తా
పదాలనై
భావాలను
పారిస్తా
జాబిలినై
వెన్నెలను
కాస్తా
మేఘాలనై
వానజల్లులు
కురిపిస్తా
గానమునై
గళమును
విప్పుతా
పాటనై
పరవశము
పంచుతా
కాంతినై
కళ్ళల్లో
కూర్చుంటా
చూపునై
వ్రాతలను
చదివిస్తా
శబ్దమునై
చెవులలో
దూరేస్తా
అర్ధమునై
మదులను
మురిపిస్తా
మాతనై
బిడ్డలను
బ్రతికిస్తా
భాషనై
భూమిపై
వర్ధిల్లుతా
కలమునై
కాగితంపై
వ్రాయిస్తా
కవితనై
కమ్మదనాలను
కురిపిస్తా
వెలుగునై
తెలుగును
మెరిపిస్తా
తెలుగునై
తియ్యందనాలు
చల్లేస్తా
సంగీతమునై
అధరామృతమును
తలపిస్తా
సాహిత్యమునై
ఆలోచనామృతం
త్రాగిస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment