రంగుపడిద్ది
నింగినుండి
నీలిరంగు పడిద్ది
నేలమీదపడి
పచ్చగా మారిద్ది
పొద్దునేసూర్యుడునుండి
ఎరుపురంగు ప్రసరించ్చిద్ది
కళ్ళల్లోపడి
తెల్లగా అయ్యిద్ది
పూతోటనుండి
తెల్లమల్లియ వచ్చిద్ది
పరాచకాలాడి
మసిపూసి పోయిద్ది
రోజా వచ్చిద్ది
గులాబిరంగు చల్లిద్ది
గుండెలోగుచ్చిద్ది
ఎర్రరక్తం కార్పిచ్చిద్ది
పచ్చనిగోరింట వచ్చిద్ది
పడతులచేతిపైకి ఎక్కిద్ది
ఎర్రగా పండిద్ది
షోకులు విసిరిద్ది
బంగారువన్నెల భామ
పెళ్ళిచూపులో కనపడిద్ది
సిగ్గుతో తలవంచుకొని
ఎర్రబుగ్గలు చూపిద్ది
ముద్దమందారం వచ్చిద్ది
మంకెనరంగు చల్లిద్ది
మేనును తట్టిద్ది
రంగును పూచిద్ది
హరివిల్లు వచ్చిద్ది
సప్తవర్ణాలు చూపిద్ది
వానను ఆపిద్ది
వన్నెలు చిందిద్ది
రంగులహోళి వచ్చిద్ది
వేడుకలు చేసిద్ది
వివిధరంగులును
వంటిపై విసిరిద్ది
ఊసరవల్లి
రంగులు మార్చిద్ది
ఉరివి
వన్నెలు చల్లిద్ది
రంగులు చూస్తే
పొంగిపోతా
ఆనందంలో
తేలిపోతా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment