మనతెలుగు


తెలుగుకేభాష ఇలలోసాటిగాదనీ

చాటరా

తెలుగు వెలుగుకుసమానమైనదనీ

చెప్పరా


తెలుగుతల్లికి పూదండనల్లీ

వెయ్యరా

తెలుగుజాతి ఘనమైనదనీ

తెలుపరా


తెలుగు కడుతియ్యనైనదనీ

పలుకరా

భాషలలో బహుగొప్పదనీ

గళమెత్తరా


తెలుగువారు అతితెలివైనవారనీ

నిరూపించరా

అందచందాలలలో అగ్రగణ్యులనీ

అభినందించరా


తెలుగువాళ్ళు ఎక్కడున్నప్పటికీ

ఒక్కటేరా

తెలుగుతల్లి ప్రియతమపిల్లలమనీ

కూడుమురా


తెలుగునేల సారవంతమనీ

చూపించరా

తెలుగుపంటలు శ్రేష్టమనీ

రుజువుచేయరా


తెలుగువారు మేటిరైతులనీ

మెచ్చరా

తెలుగువాళ్ళు కష్టపరులనీ

చూపరా


తెలుగుతోటలు చక్కనైనవనీ

పొగడరా

తెలుగుపూలు బహుపరిమళమనీ

కీర్తించరా


తెలుగక్షరాలు గుండ్రనిముత్యములనీ

వ్రాయించరా

తెలుగుపలుకులు లేతకొబ్బరిపలుకలనీ

రుచిచూపరా


తెలుగుజాతిచరిత్ర ఘనమనీ

గుర్తించరా

తాతముత్తాతలనాటి కథలన్నీ

ఎరిగించరా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog