ఏక్కడుంటే అక్కడే!
ఎక్కడ
తెలుగుంటే
అక్కడ
వెలుగుంటుంది
ఎక్కడ
అందముంటే
అక్కడ
ఆనందముంటుంది
ఎక్కడ
పూలుంటే
అక్కడ
పరిమళముంటుంది
ఎక్కడ
కృషియుంటే
అక్కడ
అభివృద్ధియుంటుంది
ఎక్కడ
మంచియుంటే
అక్కడ
మానవత్వముంటుంది
ఎక్కడ
ప్రయత్నముంటే
అక్కడ
విజయముంటుంది
ఎక్కడ
ప్రేమయుంటే
అక్కడ
బంధముంటుంది
ఎక్కడ
మనసుంటే
అక్కడ
అట్టియాలోచనుంటుంది
ఎక్కడ
ప్రతిభయుంటే
అక్కడ
ప్రఖ్యాతివస్తుంది
ఎక్కడ
సంతోషముంటే
అక్కడ
స్వర్గముంటుంది
ఎక్కడ
శుభ్రతయుంటే
అక్కడ
లక్ష్మియుంటుంది
ఎక్కడ
చదువుంటే
అక్కడ
సరస్వతియుంటుంది
ఎక్కడ
నీవుంటే
అక్కడ
నీకర్మవెంటయుంటుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment