కవీశ్వరా!


అక్షరాలను

వెలిగించరా 

అంధకారమును

పారద్రోలురా


పదములను

పారించురా

పాఠకులకు

పనిపెట్టరా


విషయాలను

వెల్లడించరా

విఙ్ఞానమును

వ్యాపించరా


పలుకులను

పెదవులదాటించరా

తేనెచుక్కలను

చుట్టూచిందించరా


ఆలోచలను

ఊరించరా

భావాలను

బయటపెట్టరా


అచ్చతెలుగులో

మాటలాడరా

అలతిపదాలతో

కవితలనల్లరా


ఆంధ్రులఘనతను

అందరికితెలుపురా

ఆంధ్రులాచారాలను

అన్నిచోట్లాచాటురా


మాతృభాషను

మరవద్దురా

పరబాషను

కించపరచొద్దురా


తల్లితెలుగును

వ్యాపించరా

తోటితెలుగులను

సమైక్యపరచరా


తెలుగుబాష

తేజరిల్లుబాషరా

తెనుగువారు

తెలివియున్నవారురా


అక్షరసంపదను

అందరికిపంచరా

ఆంధ్రులను

ఐశ్వర్యవంతులచెయ్యరా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog