కవితాకుసుమం
పువ్వు
పూసిదంటే
పరిసరాలు
ప్రకాశించినట్లే
పువ్వు
మొగ్గతొడిగందంటే
సొగసులు
చిందబోతున్నట్లే
పువ్వు
వికసించిందంటే
మనసు
మురిసిపోయినట్లే
పువ్వు
పరిమళించిందంటే
ప్రాణులు
పరవశించినట్లే
పువ్వు
పిలిచిందంటే
పడుచు
పరిహాసమాడినట్లే
పువ్వు
పొంకాలుచూపిందంటే
ప్రమోదము
పంచిపెట్టినట్లే
పువ్వు
ఊగిందంటే
ఎదను
ఊహలుముట్టినట్లే
పువ్వు
పిలిచిందంటే
ప్రకృతి
ప్రభవించినట్లే
పువ్వు
కోరిందంటే
కవిత
పుట్టినట్లే
పువ్వు
నవ్విందంటే
కన్నియ
కన్నుగీటినట్లే
పువ్వు
పరిహాసమాడితే
కవితాకన్యక
కవ్వించినట్లే
పువ్వు
ఇచ్చామంటే
ప్రేమను
ప్రకటించినట్లే
పువ్వు
వాడిందంటే
దుఃఖంలో
మునిగినట్లే
పువ్వు
రాలిందంటే
కన్నీటిచుక్క
కారినట్లే
పూలేకవికి ప్రధమ
ప్రోత్సాహము
పొంకము
పరమానందము
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఓ పువ్వు
పిలిచింది
ఓ నవ్వు
విసిరింది
ఓ పువ్వు
కవ్వించింది
ఓ కవిత
వ్రాయించింది
పాఠకులు
చదివారు
ప్రశంసలు
కురిపించారు
సాహితి
సంబరపడింది
సరస్వతి
సహకరించింది
సాహితీవనము
స్వాగతించింది
శాంతిసౌఖ్యములు
చేకూర్చింది
ఏ పువ్వుది
ఏ అందమో
ఏ కవితది
ఏ చందమో
Comments
Post a Comment