మనిషీ ఓ మనిషీ!
మనిషీ ఓ మనిషీ
ఓ మంచీ మనిషీ!
అమ్మానాన్నలతో
ఆనందముగా గడుపవోయ్
దేవతల్లా పూజించీ
దీవెనలూ పొందవోయ్
ఋణమునూ తీర్చుకొనీ
సుఖముగా బ్రతుకవోయ్
నరుడా ఓ నరుడా
మనసున్నా ఓ నరుడా!
అర్ధాంగిని ఎన్నుకొనీ
తోడుగా తెచ్చుకోవోయ్
కష్టసుఖాలలో
పాలూపంచుకోవోయ్
కడదాక కలసిమెలసీ
కాపురమూ చేయ్యవోయ్
మానవా ఓ మానవా
తెలివైనా ఓ మానవా!
పిల్లలను కనీ
పెంచీ పెద్దచెయ్యవోయ్
బరువుబాధ్యతలతో
బాగుగా చదివించవోయ్
సమాజానికి పనికొచ్చేలా
చక్కగా తీర్చిదిద్దవోయ్
మానుషా ఓ మానుషా
శక్తీయుక్తీగల ఓ మానుషా!
కొడుకుకు పెళ్ళిచేసీ
కోడలును తెచ్చుకోవోయ్
మనుమడు మనుమరాళ్ళతో
వంశాన్ని వృద్ధిచేసుకోవోయ్
సేవాతత్పరతలు నేర్పీ
సంఘానికి తోడ్పడవోయ్
మానిషీ ఓ మానిషీ
ఆలోచించగల ఓ మానిషీ!
కూతురును కనిపెంచీ
కుమరునితో సమముగా చూడవోయ్
పెద్దజేసి పెళ్ళిజేసి
అల్లునితో అత్తవారింటికి పంపవోయ్
కుటుంబ గౌరవమునూ
కాపాడమని బోధించవోయ్
మనుజా ఓ మనుజా
మానవత్వమున్న ఓ మనుజా!
సమాజానికి హితములు చెప్పీ
సుఖసంతసములు నివ్వవోయ్
అభివృద్ధిచేసి చూపీ
ఆనందమును పంచవోయ్
సంక్షేమ రాజ్యాన్నీ
స్థాపించి సంస్కరించవోయ్
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment