విసుర్లు


పూలు

విసురుతా

పొంకాలు

చూపుతా


చూపులు

విసురుతా

షోకులు

చూపిస్తా


నవ్వులు

విసురుతా

మోములు

వెలిగిస్తా


పలుకులు

విసురుతా

తేనెచుక్కలు

చిందిస్తా


వల

విసురుతా

చిక్కితే

బందిస్తా


పరువాలు

విసురుతా

ప్రణయంలోకి

దింపుతా


కాంతులు

విసురుతా

చీకటిని

పారదోలుతా


ఙ్ఞానాన్ని

విసురుతా

అఙ్ఞానాన్ని

తరిమేస్తా


ఈటెను

విసురుతా

ప్రాణాలతో

చెలగాటమాడుతా


తూటాలు 

విసురుతా

ప్రతీకారం

తీర్చుకుంటా


మాటలు

విసురుతా

మనసులు

దోచేస్తా


అక్షరాలు

విసురుతా

కవితలు

చదివిస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog