కవులకబుర్లు
కవుల
కబుర్లుచెబుతా
కవితాంజలులు
కదించుతా
కొంతమంది కవిమిత్రులు
కాలముచేశారు
కనుమరుగయిపోయారు
కాగితాలలో కనబడతున్నారు
కొంతమంది కవిస్నేహితులు
కష్టపడి వ్రాస్తున్నారు
కవనజ్యోతులు వెలిగిస్తున్నారు
కవితాకిరణాలు ప్రసరిస్తున్నారు
కొంతమంది కొత్తకవులు
కవనరంగంలో దిగుతున్నారు
కలాలను పరుగులెత్తిస్తున్నారు
కొత్తపరిచయాలు చేసుకుంటున్నారు
కొంతమంది పాతకవులు
కళ్ళముందుకొస్తున్నారు
కలలోకొస్తున్నారు
కవ్వించి వ్రాయిస్తున్నారు
కవులతో స్నేహంచేస్తా
కవితలలో పోటీపడతా
కవిసమ్మేళనాలలో పాల్గొంటా
కవితాభిమానులను తృప్తిపరుస్తా
కవితాకుసుమాలు పూయిస్తా
కవనకాంతులు వెదజల్లుతా
కవిత్వరుచులు చూపించుతా
కలకాలం గుర్తుండెలాచేస్తా
కవనజల్లులు కురిపిస్తా
కవితానదులు పారిస్తా
కడలిలో కలిపేస్తా
కైతలలో ముంచేస్తా
కవితాప్రియులారా
కదలండి
కవితామృతమును
క్రోలండి
కీర్తిశేషకవులకు నీరాజనాలు
కవిమిత్రులకు ధన్యవాదాలు
కొత్తకవులకు అభివందనలు
కవితాలోకానికి వందనాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment