ఒక వ్యవహారం.....


ఒక అందం

కనపడింది

ఒక ఆనందం

కలిగించింది


ఒక అదృష్టం

దొరికింది

ఒక అవకాశం

చిక్కింది


ఒక నవ్వు

విసరాలనిపించింది

ఒక కోరిక

తెలపాలనిపించింది


ఒక పువ్వు

తెద్దామనిపించింది

ఒక కొప్పులో

తురుమాలనిపించింది


ఒక ఆట

ఆడాలనిపించింది

ఒక పాట

పాడాలనిపించింది


ఒక చోట

కలవాలనిపించింది

ఒక పూట

గడపాలనిపించింది


ఒక మాటను

చెప్పాలనిపించింది

ఒక మెప్పును

పొందాలనిపించింది


ఒక బాటన

నడవాలనిపించింది

ఒక గమ్యాన్ని 

చేరాలనిపించింది


ఒక కాగితం

తీసుకోవాలనిపించింది

ఒక ప్రేమలేఖ

వ్రాయాలనిపించింది


ఒక కవిత

వ్రాయాలనిపించింది

ఒక చరిత్ర

సృష్టించాలనిపించింది


ఒక సారి

చెంతకుచేర్చుకోవాలనిపించింది

ఒక రహస్యం

చేవిలోచిన్నగాచెప్పాలనిపించింది


ఒక బంధం

కావాలనిపించింది

ఒక అనుబంధం

పెంచుకోవాలనిపించింది


ఒక తాళి

కట్టాలనిపించింది

ఒక తోడు

తెచ్చుకోవాలనిపించింది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


ఒక మారు

పూర్తిగాచదవండి

ఒక వ్యాఖ్య

నచ్చితేచెయ్యండి


ఒక మంచి

తలచండి

ఒక సారి

దీవించండి


ఒక సొగసున్నచిన్నదానికి

ఒక సుమనస్కుడినికలపండి

ఒక వయసున్నవగలాడికి 

ఒక సరసుడినిజతచేయండి



Comments

Popular posts from this blog