నడువు నడువు


నడువు నడువు 

ముందుకు నడువు

వడివడిగా అడుగులువేస్తు

దూరాభారాలు అధిగమిస్తు        ||నడువు||  


నడువు నడువు

ముందుకు నడువు

దురాచారాలను రూపుమాపుతు

సదాచారాలను ప్రోత్సహించుతు    ||నడువు||


నడువు నడువు

ముందుకు నడువు

ముక్కు సూటిగాను

మంకు పట్టుతోను             ||నడువు||

       

నడువు నడువు

ముందుకు నడువు

ఆడవారికి అండనిస్తు

శిశువులను సంరక్షిస్తు           ||నడువు||


నడువు నడువు

ముందుకు నడువు

అన్నార్తుల ఆకలితీరుస్తు

అభాగ్యుల అవస్థలంతంచేస్తు      ||నడువు||


నడువు నడువు

ముందుకు నడువు

విజయాలను సాధిస్తు

లక్ష్యాలను ఛేదిస్తు              ||నడువు||


నడువు నడువు

ముందుకు నడువు

అవినీతిని చెండాలుతు

అన్యాయాలను అరికడుతు        ||నడువు||


నడువు నడువు

ముందుకు నడువు

కష్టాలను ఓర్చుకుంటు

నష్టాలను భరించుకుంటు         ||నడువు||


నడువు నడువు

ముందుకు నడువు

అందాలను చూస్తు

ఆనందాలను పొందుతు          ||నడువు||


నడువు నడువు

ముందుకు నడువు

కర్షకులను కాపాడుకుంటు

కార్మికులను కాచుకుంటు         ||నడువు||


నడువు నడువు

ముందుకు నడువు

సమానత్వం సాధనకు

కులమతాల నిర్మూలనకు         ||నడువు|| 


నడువు నడువు

ముందుకు నడువు

ముళ్ళబాటను దాటుకుంటు

రాళ్ళదారిని తప్పించుకుంటు      ||నడువు|| 


నడువు నడువు

ముందుకు నడువు

ఎవరెస్టు ఎత్తులవరకు 

కడలి అగాధాలవరకు           ||నడువు|| 


నడువు నడువు

ముందుకు నడువు

అపశృతులు పట్టించుకోకుండా

అనుమానాలు పెట్టుకోకుండా      ||నడువు||


నడువు నడువు

ముందుకు నడువు

చీకటైనా ఒంటరయినా

ఎండయినా వానయినా         ||నడువు||


నడువు నడువు

ముందుకు నడువు

పట్టు వీడకుండా          

రాజీ పడకుండా             ||నడువు|| 


నడువు నడువు

ముందుకు నడువు

అదరక బెదరక

వెనుతిరగక వెన్నుచూపక       ||నడువు||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog