కలాలగళాలు
అల్లుకొంటా
డొంకలు దూసుకొనిపోతా
చెట్లను చుట్టుకుంటూవెళ్తా
ఆకాశపు అంచులుచేరతా
వెలిగిస్తా
అక్షరజ్యోతులు
మోములనవ్వులు
మదులమెరుపులు
వదులుతా
తీయనిమాటలు
కవిగారితూటాలు
మన్మధునిబాణాలు
తడతా
పాఠకులవెన్నులు
మనుజులమనసులు
సాహిత్యాభిమానాలు
పంపుతా
పూలకవితలు
ప్రేమకైతలు
ప్రబోధగీతాలు
చెబుతా
తీయనితేనెలొలుకుకబుర్లు
మదిమెచ్చేటిముచ్చట్లు
గుర్తుండిపోయేగుసగుగుసలు
చూస్తా
అందచందాలు
తెలుగువెలుగులు
సాహిత్యసంబరాలు
శ్రమిస్తా
సాహితీసేవకి
భాషాభివృద్ధికి
మదులవికాసానికి
పొందుతా
ప్రశంసలవర్షం
ప్రధమస్థానం
పరమానందం
చల్లుతా
పూలపరిమళాలు
తేనెచుక్కలు
అద్భుతపదాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment