పూలతెమ్మెరలు


మొగ్గలు

తొడగనీ

కొమ్మకొమ్మను

నింపనీ


పువ్వులు

పూయనీ

మనసులు

దోచనీ


పుష్పాలు

విరియనీ

పొంకాలు

చూపనీ


పువ్వులు

చూడనీ

పరవశం

పొందనీ


పూలదగ్గరకు

వెళ్ళనీ

పరిమళాలు

పీల్చనీ


పువ్వులను

పరికించనీ

పులకరించి

పోనివ్వనీ


పువ్వులు

తీసుకొనిరానీ

ప్రియురాలు

తలలోతురుమనీ


పువ్వులు

తాకనీ

ముచ్చట

పడనీ


పువ్వులను

పిలువనీ

ప్రేమను

తెలుపనీ


తేటుగా

మారనీ

తేనెను

క్రోలనీ


పువ్వు

పడచులా

షోకుల

సుకుమారి


పుష్పం

కన్యలా

కళ్ళకు

ఆనందకారి


పువ్వు

ప్రేమకుప్రతిరూపం

నవ్వు

నాతిమదికిప్రతిబింబం


పువ్వు

పూబోడికిసోదరి

సిగ్గు

చిన్నదానిసహవాసి


పూలకన్యల

సంతసపెడతా

ప్రేమలోకాన

సంచరించుతా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog