పువ్వులు పదాలు


పూలను

పిలుస్తా

పదాలను

ప్రవరిస్తా


పూలను

పూయమంటా

పదాలను

పారమంటా


పూలను

పరికిస్తా

పదాలను

పలుకుతా


పూలమాలను

గుచ్చుతా

పదాలను

పేర్చుతా


పూలను

ప్రేమించుతా

పదాలను

ప్రయోగించుతా


పూలను

ప్రశంసిస్తా

పదాలను

ప్రసంగిస్తా


పూతేనెను

సేకరిస్తా

పదములకు

తీపినిపూస్తా


పూపరిమళాలు

పీల్చుతా

పదమాధుర్యాలు

పంచుతా


ఫూలను

కళ్ళముందుంచుతా

పదాలను

పెదవులుదాటించుతా


పూలపొంకాలు

ఆస్వాదిస్తా

పదసౌందర్యాలు

అందజేస్తా


పూలను

పడతులకిస్తా

పదాలను

పాఠకులకిస్తా


పూలిచ్చి

ప్రేమనుతెలుపుతా

పదాలువాడి

పాండిత్యముచూపుతా


పూలను

పరికీర్తిస్తా

పదాలను

ప్రశంసిస్తా


పువ్వు

పడతి

పదము

ప్రేయసి


పూలు

ప్రకృతి

పదాలు

సాహితి


నాకు

పూలుకావాలి

పదాలుకావాలి

పాఠకులుకావాలి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog