మరదలుపిల్ల 


పెట్టుకుంది

మల్లెచెండు

వచ్చింది

కళ్ళముందు


చల్లింది

సువాసన

దింపింది

మత్తులోన


నచ్చింది

బంగరుబొమ్మ

నడిచింది

హంసనడక


చూపింది

చంద్రవదనం

వేసింది

వలపుగాలం


చిందింది

చిరునవ్వు

దోచింది

దోరవయసు


ఒలికింది

వయ్యారాలు

చల్లింది

ప్రేమజల్లులు


చూపింది

చక్కదనాలు

చేర్చింది

సంతోషాలు


వస్తానంది

వధువులాగ

ఇస్తానంది

మధువుపాత్ర


వినిపించింది

గాజులచప్పుడు

మ్రోగించింది

కాళ్ళగజ్జలు


వేసింది

పగ్గాన్ని

పట్టింది

ప్రాయాన్ని


చిక్కింది

చేపపిల్ల

దొరికింది

లేడికూన


ముంచింది

ప్రేమలోన

తేల్చింది

సుఖములోన


మరువను

మరదలును

విదేశాలకు

విడిచివెళ్ళను


కడతాను

మంగళసూత్రం

వేస్తాను

వీడనిబంధం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog