తరంగాల తారంగం
తరంగాలు
తచ్చాడుతున్నాయి
సరాగాలు
సయ్యాటలాడుతున్నాయి
శబ్దతరంగాలు
చరించుతున్నాయి
శ్రవణేంద్రియాలు
స్వీకరించిస్పందిస్తున్నాయి
గాలితరంగాలు
గమనంసాగిస్తున్నాయి
గాత్రాలు
గమనించిసేదదీరుతున్నాయి
కిరణతరంగాలు
ప్రసరిస్తున్నాయి
చక్షువులు
చూపులుసారించుతున్నాయి
చరవాణితరంగాలు
సంచరిస్తున్నాయి
చేపలుకులనుతాకి
సంభాషించమంటున్నాయి
ఆడియోతరంగాలు
రేడియోలనుతాకుతున్నాయి
మాటలుపాటలు
ఇంపుగావినిపించుతున్నాయి
వీడియోతరంగాలు
టీవీలకుచేరుతున్నాయి
దృశ్యాలను
దర్శింపజేస్తున్నాయి
కడలితరంగాలు
కదులుతున్నాయి
తీరమును
తాకిపడుతున్నాయి
ప్రేమతరంగాలు
గుండెలోపుడుతున్నాయి
బంధాలను
తోడుకుతెచ్చుకోమంటున్నాయి
ఆలోచనాతరంగాలు
వెంటబడుతున్నాయి
అంతరంగాలను
అంటిప్రేరేపిస్తున్నాయి
మనోతరంగాలు
మూడులోకాలుతిరుగుతున్నాయి
మనుషులకు
మేధోసంపత్తినిస్తున్నాయి
కవనతరంగాలు
కవితలనుపుట్టిస్తున్నాయి
మనసులను
ముట్టిమురిపించుతున్నాయి
తరంగాలతో
తారంగమాడుదాం
వీరంగాలతో
వేడుకచేసుకుందాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
చేపలుకు= చేతిఫోను
Comments
Post a Comment