వాగీశ్వరీ!


తల్లీవాగ్దేవీ!

తలపులు

తలకెక్కించవమ్మా

రాతలు

రమ్యంగారాయించవమ్మా


వాణీదేవీ!

విషయాలు

సూచించవమ్మా

వివిధకవితలు

వ్రాయించవమ్మా


గీర్వాణీ!

కవితామేఘాలు

సృష్టించవమ్మా

కవితాజల్లులు

కురిపించవమ్మా


భారతీ!

భావాలు

పుట్టనివ్వమ్మా

బహుకవితలు

బయటపెట్టనివ్వమ్మా


సరస్వతీ!

కవితాపుష్పాలు

పూయించవమ్మా

సుమసౌరభాలు

వెదజల్లనివ్వమ్మా


శారదా!

మనసును

వెలిగించవమ్మా

మంచికవితలనూ

మెండుగాకూర్చనీయవమ్మా


పలుకులమ్మా!

పదాలను

పారించవమ్మా

పలుకవితలను

పుటలకెక్కించనీయవమ్మా


విద్యాదేవీ!

వివిధాంశాలు

విశ్లేషణచేయనీయవమ్మా

విభిన్నప్రక్రియలు

విపులంగావిరచించనీయవమ్మా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog