హృదయరాణి
ఆమె
క్రీగంటచూచింది
కన్నులూకలిపింది
కళ్ళలోనిలిచింది
ఆమె
ముద్దుగాపిలిచింది
ముచ్చటాలాడింది
మురిపమూచేసింది
ఆమె
తీపిగాపలికింది
తేనెలూచిందింది
తోడుకూరమ్మంది
ఆమె
అందాలుచూపింది
ఆనందమునిచ్చింది
అంతరంగాన్నిదోచింది
ఆమె
కలలోకివచ్చింది
కవ్వించిపోయింది
కోరికలులేపింది
ఆమె
రాగాలుతీసింది
రంజింపజేసింది
రసప్రాప్తినిచ్చింది
ఆమె
చిరునవ్వుచిందింది
చెంతకువచ్చింది
చక్కదనాలుచూపింది
ఆమె
పూలనువిసిరింది
పరిమళాలుచల్లింది
ప్రేమలోదించింది
ఆమె
వయ్యారలొలికింది
వాలుజడనూపింది
వలపులోతడిపింది
ఆమె
చేయినిచాచింది
చేతులుకలిపింది
చేరువునేనిలిచిపోయింది
ఆమె
సరసాలాడింది
సంబరపరిచింది
సతియైపోయింది
ఆమెనాకు
ప్రాణమయ్యింది
జీవితమయ్యింది
ప్రపంచమయ్యింది
ఆమెను
ఇంకేమడుగను?
ఎలావదలను?
ఎట్లామరువను?
ఆమెను
గుండెలోదాచుకుంటా
మదిలోనిలుపుకుంటా
హృదయరాణినిచేసుకుంటా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment