ఒక పువ్వు
ఓ పొద్దు
పొడిచింది
ఓ పూవు
పూచింది
ఓ పువ్వు
కనపడింది
ఓ నవ్వు
తెప్పించింది
ఓ సుమం
విరిసింది
ఓ సౌందర్యం
చూపింది
ఓ కొమ్మ
కదిలింది
ఓ ఆర్తవం
ఊయలూగింది
ఓ పవనం
వీచింది
ఓ సౌరభం
చల్లింది
ఓ ప్రసూనం
తేనెనుదాచింది
ఓ భ్రమరం
మధువునుక్రోలింది
ఓ కుసుమం
రంగునుచూపింది
ఓ కిరణం
వెలుగునుచిమ్మింది
ఓ అలరు
ఆకర్షించింది
ఓ మారు
చూడమంది
ఓ పుష్పం
వాడింది
ఓ విచారం
ఆవరించింది
ఓ పీలుపు
రాలిపడింది
ఓ గుబులు
పుట్టించింది
పూదోటలలో
విహరిస్తా
పూబాలలతో
స్నేహంచేస్తా
పువ్వులను
ప్రేమిస్తా
కవితలను
కుమ్మరిస్తా
చదువరులను
స్పందింపచేస్తా
పాఠకులను
పరవశింపజేస్తా
మనసులను
దోచుకుంటా
మదులలో
నిలిచిపోతా
పూప్రేమికులైతే
పులకరిస్తా
పూలకవినంటే
పొంగిపోతా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment