పచ్చదనం
పచ్చదనము చూడ
పరవశించు మది
సహజ ప్రకృతికి
ఇలలోలేదు సాటి
కొమ్మకొమ్మను కన
పత్రపత్రము కాంచ
శోభాయమానము
హరితవనము
ఎండను తగ్గించు
ప్రాణవాయువు నిచ్చు
వానలు కురిపించు
చెట్లు కడుమనోహరము
పూవులు పూయు
కాయలు కాయు
విందుల నిచ్చు
వృక్షరాజములు
పక్షులకు గూళ్ళనిచ్చు
పశువులకు మేతనిచ్చు
ప్రాణులకు నీడనిచ్చు
ప్రకృతి బహుసుందరంబు
కన్నులను కట్టివేయు
మనసులను మురిపించు
కవులను ప్రకృతిప్రేరేపించు
కమ్మనికవితలు వ్రాయించు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment