కవితావర్షం
అంతరిక్షంలో
కారుమబ్బులు కమ్ముతుంటే
అంతరంగంలో
ఆలోచనలు కూడుతున్నాయి
నల్లమబ్బులు
గుమికూడి చిమ్మచీకటినిచేస్తే
తలలోభావాలు
గాఢమై చిక్కబడుతున్నాయి
వానచినుకులు
టపటపా రాలుతుంటే
అక్షరాలు
చిటపటా చిందుతున్నాయి
కాలువలుకట్టి
నేలపైనీరు పారుతుంటే
పదాలుపేరుకొని
గలగలా ప్రవహిస్తున్నాయి
జలాశయలలో
ఉదకం చేరుతుంటే
కాగితాలలో
కవితలు కూడుతున్నాయి
నీరుత్రాగి
ప్రాణులు దప్పికతీర్చుకుంటుంటే
పఠించి
పాఠకులు సాహిత్యపిపాసతీర్చుకుంటున్నారు
నీటిలో
మునగండి
కవితలలో
తేలండి
నీటితో
శరీరమును చక్కగాశుభ్రపరచుకోండి
కైతలతో
మనసును మాలిన్యరహితంచేసుకోండి
అపారసముద్రం
జలపెన్నిధి
సాహిత్యసంద్రం
ఙ్ఞానపెన్నిధి
ఆహా! ఏమి సృష్టి?
ఏమి ప్రకృతి?
నయనాలకు అందం
మదులకు ఆనందం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఏమీటో ఈపిచ్చి
కవిత వ్రాయనిదే
నిద్రపట్టటంలేదు
అక్షరాలురాల్చనిదే
ఆకలితీరటంలేదు
ఏమిటో ఈపైత్యం
కలం పట్టనిదే
కాలంగడవటంలేదు
కాగితాలు నింపనిదే
కరాలూరుకోవటంలేదు
Comments
Post a Comment