నీలాకాశం
అత్యంత అందంగాయున్నది
ఆకాశం
అమిత అనందాన్నియిస్తున్నది
వాతావరణం
పిలుస్తున్నది
నీలిగగనం
చూడమంటున్నది
పైకెత్తిశిరం
తేలుతున్నాయి
తెల్లమబ్బులు
తృప్తినిస్తున్నాయి
తిలకించువార్లకు
రంగును
తీసుకోమంటున్నది
ఆటలను
ఆడుకోమంటున్నది
నీలివస్త్రం
తీసుకెళ్ళమంటున్నది
బట్టలను
కుట్టించుకోమంటున్నది
పక్షిలా
ఎగిరిరమ్మంటున్నది
నింగినంతా
విహరించమంటున్నది
మేఘాలనెక్కి
స్వారిచేయమంటున్నది
పరవశించి
పొంగిపొమ్మంటుంది
ఆకాశం
అద్భుతం
కడురమ్యం
ఖగోళం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment