నీలాలనింగిలో నిండుజాబిలి
అదిగో
నీలాకాశం
అల్లదిగో
చంద్రబింబం
తారలమధ్య
చంద్రుడు తిరుగుతున్నాడు
తెల్లని కౌముది
పిండిని ఆరబోస్తున్నట్లున్నది
చల్లనివెన్నెల
శరీరానికి హాయినిస్తున్నది
వెండిమబ్బులు
ఆకాశాన తేలుతున్నవి
నింగి
వెలిగిపోతుంది
నేల
మెరిసిపోతుంది
కోడెకారు
పరుగులెత్తుతుంది
కోర్కెలు
చెలరేగుతున్నాయి
మల్లెలు
పరిమళాలు చల్లుతున్నాయి
మదులు
మత్తులో తూగుతున్నాయి
సొగసు
సయ్యాటలాడుతుంది
మనసు
ముచ్చటపడుతున్నది
నిండు చంద్రుడు
నింగిలో పయినిస్తున్నాడు
తళతళ తారలు
మేఘాలతో దోబూచులాడుతున్నాయి
భూమి
నీవుతిరగకు
జాబిలిని
కదలనీయకు
రవి
నీవుపొడవకు
వెన్నెలను
హరించకు
కాలమా
ఆగిపో
చంద్రమా
నిలిచిపో
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment