తెలుగు తియ్యందనాలు
తెలుగు
అందాలను
ఆస్వాదించాలని
ఆతురుతపడుతున్నా
తెలుగు
వెలుగులను
చిమ్మాలని
తపించిపోతున్నా
తెలుగు
పాలకడలిని
చిలకాలని
చూస్తున్నా
తెలుగు
అమృతాన్ని
పుట్టించాలని
ప్రయత్నిస్తున్నా
తెలుగు
పూదోటను
పెంచాలని
శ్రమిస్తున్నా
తెలుగు
సుమాలను
పూయించాలని
కష్టపడుతున్నా
తెలుగు
సౌరభాలను
చల్లాలని
కోరుతున్నా
తెలుగు
తియ్యదనాలను
చూపాలని
కలలుకంటున్నా
తెలుగు
రుచులను
తినిపించాలని
వండుతున్నా
తెలుగు
అక్షరాలను
ఇంపుగాసొంపుగా
పేర్చాలనిచూస్తున్నా
తెలుగు
పదాలను
నదిలోనినీరుగా
ప్రవహింపచేయాలనిచూస్తున్నా
తెలుగు
కవితలను
వ్రాయాలని
కలంపడుతున్నా
తెలుగు
పాఠకులను
పరవశింపజేయాలని
పూనికతోపుటలపైగీస్తున్నా
తెలుగుతల్లి
ఋణమును
తీర్చుకోవాలని
తనయుడిగాతహతహలాడుతున్నా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment