పుష్పకన్యలు


మాలతి పిలిచింది

మధువునిచ్చింది

మత్తెక్కించింది

మైమరపించింది


సుమ పిలిచింది

సరసాలాడింది

షోకులుచూపింది

సంతసపరచింది


పద్మ పిలిచింది

పకపకానవ్వింది

పరాచకాలాడింది

పరమానందమిచ్చింది


కుసుమ పిలిచింది

కూర్చోపెట్టింది 

కబుర్లుచెప్పింది

కుతూహలపరచింది


పారిజాతం పిలిచింది

పాటలుపాడింది

ప్రేమనుతెలిపింది

పరవశింపజేసింది


లత పిలిచింది

లావణ్యముచూపింది

లాస్యమాడింది

లంకెనువేసింది


కుముదిని పిలిచింది

కమ్మదనంచూపింది

కోరికనుతెలిపింది

కుషీపరచింది


మల్లియ పిలిచింది

మాటలుచెప్పింది

ముగ్ధుడినిచేసింది

మనసునుదోచింది


కమల పిలిచింది

కాంతులుచిమ్మింది

కళకళలాడింది

కన్నులుకట్టిపడేసింది


సంపంగి పిలిచింది

సమీపానికొచ్చింది

సుగంధంచల్లింది

సంబరంచేసింది


పుష్ప పిలిచింది

పొంకముచూపింది

పరిమళముచల్లింది

పారావశ్యపరచింది


ప్రసూన పిలిచింది

ప్రసన్నపరచింది

ప్రణయంలోదించింది

ప్రమోదపరచింది

 

రోజా పిలిచింది

రోచిస్సువిసిరింది

రంగునుచల్లింది

రసప్రాప్తినిచ్చింది


లావిక వచ్చింది

లతాంతాలుతెచ్చింది

లెస్సగాపలికింది

లెంపనునిమిరింది


ఆహా! ఏమి భాగ్యము?

అందము

నాదే

ఆనందము

నాదే


ఆహా! ఏమి అదృష్టము?

కవిత

నాదే

భవిత

నాదే


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog