పుడమితల్లికి ప్రణామాలు
జననీ
జన్మభూమి
మననేల
మనకన్నతల్లి
పుట్టగానే
స్వాగతిస్తుంది
బరువునుమోసే
బాధ్యతతీసుకుంటుంది
జీవితాంతము
భారంవహిస్తుంది
బ్రతుకును
బంగారుమయంచేసుకోమంటుంది
అడుగులు
వెయ్యమంటుంది
ఆటలు
ఆడుకోమంటుంది
పంటలు
పండించుకోమంటుంది
పొట్టలు
పోషించుకోమంటుంది
పచ్చనిచెట్లను
పెంచుకోమంటుంది
ప్రాణవాయువును
పీల్చుకోమంటుంది
ఖనిజాలను
ఇస్తుంది
ఖజానాను
నింపుకోమంటుంది
నీటిని
దాస్తుంది
దప్పికను
తీర్చుకోమంటుంది
నివాసం
ఏర్పరచుకోమంటుంది
ఎండావానలనుండి
కాపాడుకోమంటుంది
పూలను
పూయిస్తుంది
పరిమళాలను
వెదజల్లుతుంది
అందాలు
చూపిస్తుంది
ఆనందము
కలిగిస్తుంది
వెలుగును
స్వీకరిస్తుంది
దారులను
చూపిస్తుంది
వెన్నెలను
ఆహ్వానిస్తుంది
మనసులను
మురిపిస్తుంది
శవమైనపుడు
స్థానమిస్తుంది
శరీరానికి
మోక్షమిస్తుంది
శిరసువంచి
సదా స్మరించుకుంటా
పుడమితల్లికి
ప్రతిదినం ప్రణమిల్లుతా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment