కొత్తకవి
పేపరులో
పేరువస్తే
పరమానందపడి
పొంగిపోతాడు కొత్తకవి
పత్రికలో
ఫొటోవస్తే
పరవశించి
పులకరించుతాడు యువకవి
ప్రజలల్లో
ప్రాచుర్యంలభిస్తే
పెద్దకవినని
ఫోజుపెడతాడు నవకవి
సమ్మేళనానికిపిలిచి
శాలువాకప్పి
సన్మానంచేస్తే
సంబరపడతాదు సరికొత్తకవి
పోటీలోతనకవితకు
ప్రధమస్థానమొస్తే
ప్రఖ్యాతకవిగానని
ప్రకటించుకుంటాడు నూతనకవి
పుస్తకమొకటి
ప్రింటుచేయించి
పలువరికిపంచి
ప్రమోదపడతాడు వర్ధమానకవి
పలుకవితలను
పఠించండి
పెక్కుకవులను
ప్రోత్సహించండి
పాతకవులకు
ప్రణమిల్లుదాం
కొత్తకవులను
స్వాగతిద్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment