కవిగారి చూపులు


చుట్టుపక్కలు

చూస్తా

చక్కదనాలు

చక్కగావర్ణించి చూపుతా


తూర్పుదిక్కు

తిలకిస్తా

తీపిపలుకులు 

తేటపదాలతో వినిపిస్తా


పడమట

పరికిస్తా

పాఠకుల 

పలుకవితలతో పరవశపరుస్తా


ఉత్తరం

ఉద్వీక్షిస్తా

ఉత్తమకవిత్వం

ఊరూరా చేరుస్తా


దక్షణం

దర్శిస్తా

దీటైనసాహిత్యం

దృష్టికి తీసుకొస్తా


ఎత్తుకు

ఎగిరికాంచుతా

ఎదసొదలను

ఎల్లరకు ఎరిగిస్తా


క్రిందను

కాంచుతా

కడుకవితలను

కమ్మగా కూర్చుతా


ప్రక్కన

పరిశీలిస్త్తా

పెక్కుకయితల

పేర్చి పారించుతా


అన్నిదిక్కులు

అవలోకించుతా

అద్భుతకవనాలను

అందంగా ఆవిష్కరిస్తా


వీక్షించింది

వ్రాస్తా

సర్వులని

సంతోషంలో ముంచుతా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog